ప్రొమోతోనే అంచనాలను పెంచేసిన నితిన్!

115
nithin
- Advertisement -

రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఆగ‌స్టు 12న సినిమా విడుదల కానుండగా మొద‌టి సారిగా నితిన్ పూర్తి స్థాయి మాస్ యాక్ష‌న్ చిత్రంలో న‌టించాడు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసాయి.

సినిమా ట్రైలర్ శనివారం విడుదల కానుండగా ట్రైల‌ర్‌కు స‌ర్వం సిద్ధం అంటూ మాస్ ప్రోమోను విడుద‌ల చేశారు. ఇక ఇటీవ‌లే విడుద‌లైన గ్లింప్స్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను అమాంతం పెంచింది. ప్రేమ‌కథా చిత్రాల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే నితిన్ ఈ సారి అవుట్ అండ్ అవుట్ మాస్ క‌థ‌తో రానుండ‌టంతో ప్రేక్ష‌కుల‌లో విప‌రీత‌మైన క్యూరియాసిటీ ఏర్ప‌డింది.

నితిన్ సరసన కృతిశెట్టి, క్యాథెరీన్ థ్రెసా హీరోయిన్లుగా న‌టించారు. ఆదిత్య మూవీస్ &ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

- Advertisement -