Tollywood:మాయా టీజర్

28
- Advertisement -

నవిన్ క్లౌడ్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై జీరో ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న తాజా చిత్రం మాయ. రాజేష్ గొరిజవోలు నిర్మాణ సారథ్యంలో రమేష్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన మాయ టీజర్ విడులైంది. మిస్టీరియస్ థ్రిల్లర్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టపడేసేలా ఉంటుందని తాజా టీజర్ రుజువు చేసింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు.

హీరోయిన్ సిరి చందన మాట్లాడుతూ.. ముందుగా డైరెక్టర్ రమేష్ నాని కి ధన్యవాదాలు తెలిపారు. ఆయన లాంటి కూల్ డైరెక్టర్ ని ఎక్కడా చూడలేదని ప్రశంసించారు. హీరో కిరణ్ చాలా సపోరిటీవ్ అని, ఆయనతో పోటీపడి నటించానని తెలిపారు. ఎస్తర్ నోర్హానా ఇండస్ట్రీలో ఇంత పెద్ద పేరున్నా.. సెట్ లో టీం అందరితో కలిపోయారన్నారు. మాయా చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంతో హార్డ్ వర్క్ చేశారని, టీం వర్క్ చాలా నచ్చిందని తెలిపారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రాబోతుందని కచ్చితంగా అందరికి నచ్చుతుందని అన్నారు.

డైరెక్టర్ రమేష్ నాని మొదటిసారి ఇంటికొచ్చి ఈ స్టోరీ చెప్పిన వెంటనే ఒప్పుకున్నానని హీరో కిరణ్ ఆవల తెలిపారు. చిన్న సినిమాలను తొక్కేసారని చాలామంది చెప్తుంటారు, కానీ సినిమాలో విషయం ఉంటే ఎవరు తొక్కలేరని మా చిత్రం నిరూపిస్తుందని నమ్మకంగా తెలిపారు. సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు టీం వర్క్ తో పూర్తి చేసామని, ఇక డైరెక్టర్స్ టీం ల్యాబ్ లో సైంటిస్టుల్లా ప్రతిరోజు చాలా శ్రమించే వారిని పేర్కొన్నారు. చాలా క్లారిటీతో చేశారని ప్రశంసించారు. సినిమాలో ఒక ముఖ్యపాత్రలో నటించిన సురేష్ కొండేటి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హీరోయిన్ సిరి చందన, ఎస్తర్ నటీనటులందరితో వారితో పని చేయడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. మ్యూజిక్ డైరెక్టర్ సూర్య వర్క్ ఎంతో నచ్చిందని, ఈ సినిమాకు ప్రాణం పెట్టి చేశారని కొనియాడారు. డబ్బులు ఎక్కడ వేస్ట్ కాకుండా ప్రొడ్యూసర్ కు ఫేవర్ గా సినిమాను తెరకెక్కించారని వివరించారు. చిన్న సినిమాను పెద్ద సినిమాగా చేసే ఒకే ఒక పవర్ మీడియాకు ఉందని, కచ్చితంగా మా సినిమాను సపోర్ట్ చేసి పెద్ద సినిమా చేయాలని మీడియా మిత్రులకు కిరణ్ ఆవల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Also Read:హ్యాపీ బర్త్ డే…వెంకటేష్

- Advertisement -