శివాజీరాజాను ‘మా’ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నటుడు రాజేంద్రప్రసాద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘మా’ అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ పదవీకాలం ముగియడంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గడిచిన రెండేళ్లలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని, పేద నటీనటులకు ఆర్థిక సాయం, హెల్త్‌కార్డులు, పెన్షన్లు అందిస్తున్నామని గత ఎన్నికల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) రెండు వర్గాలుగా విడిపోయి పోటీ చేశాం. కానీ ఈ దఫా ఎలాంటి పోటీ లేకుండా కొత్త కమిటీ ఎన్నికకు అందరు సహకరించారని నూతన ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా తెలిపారు. ఏదైనా ఆపద వస్తే మా ఉందనే ధైర్యంతో కళాకారులందరూ బ్రతకాలి అన్నారు.తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 250 చిత్రాలకుపైగా నటించి శివాజీరాజా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు.
ఏకగ్రీవంగా ‘మా’ అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా శివాజీ రాజా ఇటీవల ‘మా’ ఫౌండర్ ప్రెసిడెంట్ మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిసి బ్లెస్సింగ్స్ అందుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏకగ్రీవంగా ఎన్నికైన జాయింట్ సెక్రటరీలలో ఒకరైన ఏడిద శ్రీరామ్, ఈసీ మెంబర్ సురేష్‌కొండేటి కూడా పాల్గొన్నారు.