మూవీ ఆర్టీస్ట్ అసోషియేషన్ ఎన్నికలు జరిగి వారం రోజులు గడుస్తున్న ఇంకా పాత వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. హోరాహోరిగా జరిగిన ఈ ఎన్నికల్లో శివాజి రాజాపై నరేష్ 69ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికలు ముఖ్యంగా శివాజిరాజా, నరేష్ ల మధ్యలో జరిగాయి. ఇక ఇటివలే జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన నరేష్ ప్యానల్ ప్రమాణాస్వీకారానికి ఈ నెల 22న ముహుర్తం నిర్ణయించుకున్నారు. అయితే ఈవిషయంపై శివాజి రాజా నరేష్ పై కామెంట్స చేశారు. తన పదవి కాలం మార్చి 31 వరకూ ఉందని..ఆ తర్వాతనే కొత్తగా ఎన్నికైన వారు ప్రమాణస్వీకారం చేయాలని తెలిపారట మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా.
అంతేకాదు పెండింగ్ లో ఉన్న చెక్కుల మీద సంతకాలు పెట్టేందుకు కూడా పూర్వం ఉన్న సభ్యులు సహకరించట్లేదన్నారు నరేష్. తమకు కుర్చీ పిచ్చి లేదని, అయితే ఎన్నికల సమయంలో శివాజీ రాజా వ్యవహరించిన తీరుపైన మాత్రం అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు. ఎన్నికల ముందు మా సభ్యులను శివాజీ వర్గీయులు ఎత్తుకెళ్లారని ఆరోపణలు చేశారు. చట్టపరంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎప్పుడైనా బాధ్యతలు స్వీకరించే హక్కు తమకు ఉందని తెలిపారు. ఇండస్ట్రీ పెద్దలతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు నరేష్. నరేష్, శివాజీరాజా ల మధ్య ఉన్న పర్సనల్ గొడవలు ఇంకా ఎంతవరకూ తావుతీస్తాయో చూడాలి.