స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ . ఈ చిత్రాన్ని ఆమె స్వంత బ్యానర్ త్రలాలా మూవింగ్ పిక్చర్స్ పై సమంతే నిర్మిస్తుండగా, ఆమె జీవిత భాగస్వామి రాజ్ నిడిమోరు ఈ సినిమాను రూపొందించారు. అలాగే, ‘ఓ బేబీ’ తర్వాత దర్శకురాలు నందిని రెడ్డితో సమంత మళ్లీ కలవడం ఈ సినిమాకు మరో ప్రత్యేకత.
ఈరోజు చిత్రబృందం “టీజర్ ట్రైలర్” ను విడుదల చేసింది. ఇందులో ఓ అమాయకమైన కోడలిగా ఉమ్మడి కుటుంబంలో అడుగుపెట్టిన మహిళను పరిచయం చేశారు. పైకి చూస్తే సాధారణంగా, నిర్దోషిగా కనిపించినా, ఆమె వెనుక ఓ పెద్ద రహస్యం దాగి ఉన్నట్లు టీజర్ సూచిస్తోంది. అసలు ఆమె ప్రతీకార లక్ష్యంతోనే గ్రామానికి వచ్చినట్టు తెలుస్తోంది. కథ ముందుకు సాగేకొద్దీ, ఆ కొత్త కోడలు నిజంగా ఎవరు? ఆమె అసలు ఉద్దేశ్యం ఏమిటి? అన్నది కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.
సినిమా కథపై ఆసక్తిని పెంచేలా టీజర్‌ను కట్ చేశారు. స్టైలిష్ యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గూండాలను చితకబాదే సన్నివేశాల్లో సమంత పవర్‌ఫుల్ యాక్షన్‌తో అదరగొట్టింది. టీజర్ మొత్తం కొత్తగా, ఆకట్టుకునేలా అనిపిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్ అందిస్తున్నారు.
Also Read:అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రశ్నాపత్రం లీక్!

