‘మా’ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

34
maa

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్‌ 10 ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకూ జూబ్లీ పబ్లిక్‌ స్కూల్‌లో పోలింగ్‌ జరగనున్నట్లు ఎన్నికల అధికారి వి.కృష్ణమోహన్‌ వెల్లడించారు.

ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్లు స్వీకరిస్తామని…30న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, నామినేషన్‌ ఉపసంహరణకు వచ్చే నెల 1–2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఉంటుందని వెల్లడించారు. రెండో తేది సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తామని పేర్కొన్నారు. పోలింగ్‌ రోజు రాత్రి ఏడు గంటలకు ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు.