శ్రీరెడ్డి ఎఫెక్ట్..నరేష్ ప్యానల్‌కు జైకొట్టిన నాగబాబు

240
nagababu
- Advertisement -

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎలక్షన్స్‌ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఆరోపణలు,ప్రత్యారోపణలతో ముందుకుసాగుతున్నారు నరేష్‌,శివాజీ రాజా ప్యానల్ సభ్యులు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఒకరోజుకు ముందు శివాజీరాజా ప్యానల్‌కు షాక్ ఇచ్చారు మెగా బ్రదర్ నాగబాబు. చిరు సపోర్టుతో బరిలోకి దిగుతున్నామని శివాజీ ప్యానల్ సభ్యులు చెప్పగా నాగబాబు మాత్రం నరేష్‌కు జైకొట్టారు. అంతేగాదు నరేష్ ప్యానల్‌కు సపోర్టు చేస్తూ ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వస్తుందో చెప్పారు.

శుక్రవారం నరేష్ ప్యానెల్ సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించిన నాగబాబు మా అధ్యక్ష పదవిని ఒకరు ఒకసారి మాత్రమే చేపట్టాలని, రెండోసారి చేపట్టడం తనకు ఇష్టం ఉండదని తెలిపారు. ఈ కారణంతోనే తాను రెండోసారి మా అధ్యక్షుడిగా చేయడానికి నిరాకరించానని చెప్పిన నాగబాబు అందరికీ అవకాశం ఇవ్వాలన్నారు.

ఇక శ్రీరెడ్డి అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించిన నాగబాబు మా అసోసియేష‌న్ గురించి ఎవ‌రు ప‌డితే వాళ్లు నోటికొచ్చిన‌ట్లు మాట్లాడితే… వాళ్లు(శివాజీరాజా) చూస్తుండిపోయారు కానీ యాక్ష‌న్ తీసుకోలేద‌ు. ఈ ఒక్క విష‌యంలో తాను నిరాశ‌ప‌డ్డాన‌ని నాగ‌బాబు చెప్పారు.

నరేష్‌ ప్యానల్‌లో జీవితకి మంచి పదవి ఇస్తుండటం ఆహ్వానించదగ్గ విషయమని మెగా బ్రదర్ చెప్పారు. మా జనరల్ సెక్రటరీగా నరేష్ బాగా పని చేశారన్న నాగబాబు.. అందుకే ఆయనకు మద్దతిస్తున్నానని తెలిపారు.

గత ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శులుగా ఉన్న శివాజీరాజా, నరేష్‌లు ప్రత్యర్థులుగా ‘మా’ ఎన్నికల్లో ఢీ కొట్టబోతున్న సంగతి తెలిసిందే. మొత్తం మాలో 800 మంది సభ్యులుండగా మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisement -