‘మా‘ లో శ్రీరెడ్డికి చోటు లేదు..

292
'MAA' President Sivaji Raja Controversial Comments On Sri Reddy
- Advertisement -

అర్ధనగ్న నిరసనతో సంచలనం రేపి వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డిపై మా అసోసియేషన్ సభ్యులు విలేకర్ల సమావేశంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిన్న (శనివారం) శ్రీరెడ్డి తెలిపిన నిరసనపై మా అసోసియేషన్ అధ్యక్షుడు శీవాజీ రాజా మాట్లాడుతూ ఇలా వివాదాలకు దారితీసే సంఘటనలకు పాల్పడడం ద్వారా ‘మా‘లో చోటు దక్కుతుందనుకోవడంపై శీవాజీ రాజా తప్పుబట్టారు.

'MAA' President Sivaji Raja Controversial Comments On Sri Reddy

మా అసోషియేషన్‌లోకి ఆహ్వానించేందుకు శ్రీరెడ్డికి ప్రవేశపత్రాన్ని ఇచ్చామని, వివరాలు ఇవ్వకుండా అనవసరపు రాద్దాంతం చేస్తుందని ఆర్టిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరెడ్డిపై లీగల్ కేసులకు కూడా వెనకాడబోమని మా అసోసియేషన్ ఆర్టిస్టు సభ్యులు తేల్చిచెప్పారు. శ్రీరెడ్డి అప్లికేషన్ ను కూడా తిరస్కరిస్తున్నామని, ‘మా‘ సభ్యులెవరూ ఆమేతో మాట్లాడిన, శ్రీరెడ్డితో కలిసి నటించాలని ప్రయత్నించినా వారిని కూడా సస్పెండ్ చేస్తామని తెలిపారు. వీరికి మద్దతుగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ముందుకొచ్చింది.

- Advertisement -