కార్తీ ‘దేవ్‌’ నుండి లిరికల్ సాంగ్‌.. వీడియో

228
DEV Movie
- Advertisement -

కార్తీ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవ్‌’ .. రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, నిక్కీ గల్రాని కథానాయికలుగా నటిస్తుండగా, ఖాకీ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కార్తీ ,రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ పవర్ ఫుల్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమాకి హరీష్‌ జయరాజ్‌ సంగీతమందిస్తున్నారు.

DEV Movie

తాజాగా ఈ సినిమా నుంచి ఒక తమిళ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. హృదయానికి హత్తుకునేలా ఈ మెలోడీ సాంగ్ సాగింది. నాయకా నాయికల మధ్య ప్రేమభావనాలు ఆవిష్కరించేదిగా తెరపై ఈ సాంగ్ వస్తుందని అనిపిస్తోంది. చెన్నై, హైదరాబాద్ , ముంబై , హిమాలయాస్ వంటి ప్రదేశాల్లో తెరకెక్కిన ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది.. ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ మూవీని తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగులో కార్తీకి మంచి మార్కెట్ వుంది .. రకుల్‌కి మంచి క్రేజ్ వుంది. అందువలన ఇది తెలుగులో భారీ వసూళ్లనే సాధిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జోడీకి మరో హిట్ దొరుకుతుందో లేదో చూడాలి మరి. నటీనటులు: కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, నిక్కీ గల్రాని, కార్తీక్ ముత్తురామన్, ఆర్.జె.విగ్నేష్, రేణుక, అమృత, వంశీ, జయకుమార్ తదితరులు.

- Advertisement -