ఏప్రిల్ 28… పీఎస్‌2

31
- Advertisement -

భారీ అంచనాల మధ్య విడుదలైన పొన్నియన్ సెల్వన్‌ మొదటి భాగం అంచనాలకు మించి అద్భుతమైన విజయంను తన ఖాతాలో వేసుకుంది. దీంతో కోలీవుడ్‌ ఈ సినిమాపై మరింత భారీ అంచనాలను మళ్లీ నెలకొన్నాయి. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌లో భాగంగా…లైకా ప్రొడక్షన్ హౌజ్ స్టన్నింగ్ అప్‌డేట్ లాంఛ్‌ చేసింది. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో కొనసాగనున్న సీక్వెల్‌ పార్టు అప్‌డేట్‌ను విడుదల చేసింది. 2023ఏప్రిల్‌28న విడుదలకు సిద్దంగా ఉందని ప్రకటించింది. ఇందుకోసం విక్రమ్‌ జయంరవి కార్తీ ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ల పాత్రల విజువల్స్‌తో కూడిన వీడియోను విడుదల చేసింది.

తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇందులో విక్రమ్‌, నాజ‌ర్‌, శ‌ర‌త్‌కుమార్‌, జ‌య‌రామ్‌, విక్రమ్‌ ప్రభు, కార్తీ, జ‌యం ర‌వి, పార్థీబన్‌, ప్రకాశ్ రాజ్‌, శోభితా ధూళిపాళ, ఐశ్వర్యా రాయ్‌, త్రిష కీల‌క పాత్రలు పోషించారు. మరి రెండో పార్టులో కూడా వీరంతా ఉంటారా..? లేదంటే.. కొత్త నటులు ఎవరైనా యాడ్‌ అవుతారా..? అనేది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి…

సాయి పల్లవి రూట్ లో కృతి శెట్టి

జాన్వీ నుంచి డిఫ‌రెంట్ స్టేట్ మెంట్

బాలకృష్ణతో డ్యాన్స్‌ నాఅదృష్టం: చంద్రిక

 

- Advertisement -