- Advertisement -
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో తన ప్లాట్ అమ్ముడు పోకపోవడంతో, లక్కీ డ్రా పద్ధతిలో ప్లాట్ విక్రయించేందుకు నిర్ణయించారు రామ్ బ్రహ్మచారి అనే వ్యక్తి.
తన 66 గజాల ఫ్లాట్‌ను కేవలం రూ.500కే అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయగా ప్రజల నుండి అంతే స్పందన వచ్చింది. చివరికి లక్కీ డ్రా తీయగా లక్కీ డ్రాలో రూ.500 కు రూ.16 లక్షల ప్లాట్ గెలుచుకున్నారు ఓ వ్యక్తి.
తన 10 నెలల కూతురి పేరు మీద వేసిన కూపన్‌తో అదృష్టం కలిసివచ్చింది అని శంకర్ అనే వ్యక్తి తెలిపారు. ఈ లక్కీడ్రాలో తన కుటుంబంలోని నలుగురి పేరిట కూపన్లు వేశారు శంకర్. ఇటీవల లక్కీ డ్రా తీయగా, తన కూతురు హన్సిక పేరిట ఉన్న కూపన్‌తో ప్లాట్ గెలుచుకున్నారు శంకర్. రూ.500 కే 66 గజాల ప్లాట్ గెలుచుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు.
Also Read:బస్సు ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి
- Advertisement -

