ఓటీటీలో ‘లక్కీ భాస్కర్‌’ అదిరే రికార్డు!

3
- Advertisement -

‘మహానటి’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన హ్యాట్రిక్ చిత్రం ‘లక్కీ భాస్కర్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘లక్కీ భాస్కర్’ చిత్రాన్ని నిర్మించారు. ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా థియేటర్లలో అడుగుపెట్టిన ‘లక్కీ భాస్కర్’, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ సంచలన వసూళ్లు రాబట్టింది.

తాజాగా ఓటీటీలోనూ అదిరే రికార్డు సృష్టించింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌ అయ్యేంతవరకూ జూనియర్ ఎన్​టీఆర్ ‘దేవర’నే టాప్‌ ప్లేస్​లో ఉంది. కానీ ‘లక్కీ భాస్కర్‌’ వచ్చిన తర్వాత ‘దేవర’ టాప్‌3లోకి చేరుకుంది. 15 దేశాల్లో టాప్‌ 10 సినిమాల్లో లక్కీ భాస్కర్‌ మొదటి స్థానంలో నిలిచిందని ఇటీవల నిర్మాణసంస్థ కూడా సినిమా సక్సెస్ గురించి ఓ పోస్ట్ పెట్టింది.

Also Read:PV Sindhu:పీవీ సింధు పెళ్లి తేదీ ఫిక్స్!

- Advertisement -