టాస్ గెలిచిన లక్నో.. ఆర్సీబీ బ్యాటింగ్‌..

107
RCB vs LSG
- Advertisement -

ముంబయి డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ మైదానం వేదికగా నేడు ఐపీఎల్‌లో కీలక పోరు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల తలపడుతున్నాయి. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని, అదే జట్టుతో బరిలో దిగుతున్నామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్ వెల్లడించాడు. అటు, లక్నో జట్టు కూడా మార్పుల్లేని జట్టుతో బరితో దిగుతోంది. ఈ టోర్నీలో ఈ రెండు జట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి. ఇప్పటివరకు చెరో 6 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ, లక్నో జట్లు నాలుగేసి విజయాలు సాధించాయి.

తుది జట్లు..

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, సుయాశ్ ప్రభుదేశాయ్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హాజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, మనీష్ పాండే, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బదోని, జాసన్ హోల్డర్, కృనాల్ పాండ్యా, దుష్మంత చమీర, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్

- Advertisement -