రాజ్ తరుణ్ ‘లవర్’ ట్రైలర్‌..

282
- Advertisement -

టాలీవుడ్‌ హీరో రాజ్ తరుణ్ ,రిధి కుమార్ జంటగా నటిస్తోన్న `లవర్ `చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన రాజ్‌ తరుణ్‌ ఎంట్రీ సినిమాతోనే అదరగొట్టేశాడు. తర్వాత చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్ లాంటి వరుస విజయాలతో అలరించాడు. కానీ ఆ తర్వాత వచ్చిన రంగులరాట్నం,రాజుగాడు,అందగాడు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలని లవర్‌గా ప్రేక్షకుల ముందుకువస్తున్నాడు.

Lover Movie

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా శనివారం ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్ర ట్రైలర్‌లో లవ్ కామెడీ సెంటిమెంట్…ఇలా అన్ని అంశాలతో కలగలిపి ఉన్నాయి. లవర్ బాయ్‌గా రాజ్ తరుణ్ ఆకట్టుకున్నాడు. మలయాళి నర్స్ పాత్రలో రిధి కుమార్‌ ఆకట్టుకుంది. ముఖ్యంగా వీరిద్దరి మధ్యలో కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. హాస్పటల్ లో వారిద్దరి మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

Lover Movie

అన్ని కమర్షియల్ హంగులతో దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి అనీష్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా ఈ నెల 20న సినిమా విడుదల కానుంది. ఈ మేరకు పోస్టర్‌ని విడుదల చేశారు. పోస్టర్‌ని బట్టి చూస్తే సినిమా లవ్ అండ్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

- Advertisement -