టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నారు. మంగళవారం ఈ సినిమా ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆస్కార్ గ్రహీత కీరవాణి ఆధ్వర్యంలో సింగర్స్ పాటలు పాడి ఆకట్టుకున్నారు.
నిర్మాత హన్షిత మాట్లాడుతూ `అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు సినిమాలో ఇలాంటి ఆడియో లాంచ్ మళ్లీ చేయాలంటే, కీరవాణిగారిలాంటి మ్యూజిక్ డైరక్టర్ అక్కడ ఉండాల్సిందే. అందరికీ మా సాంగ్స్ నచ్చాయని, గూస్‌బంప్స్ వచ్చాయని అనుకుంటున్నాను. నేను సినిమా చూసి చెబుతున్నాను. డబుల్, ట్రిపుల్ గూస్ బంప్స్ మా మూవీ చూశాక వస్తాయి. మంచి పాటలు రాశారు చంద్రబోస్‌గారు. పీసీ శ్రీరామ్‌గారి పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. మా డైరక్టర్, హీరో, హీరోయిన్లు, మరో నిర్మాత నాగ గురించి సక్సెస్ మీట్‌లో మాట్లాడతాను. ఏప్రిల్ 25న సినిమా విడుదలవుతుంది. ఎప్పుడైనా, ఎవరైనా గోస్ట్ ని లవ్ చేశారా? లవ్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది` అని అన్నారు.
డైరక్టర్ అరుణ్ మాట్లాడుతూ `ఈ జర్నీలో నేను నేర్చుకున్నది… ఓ దర్శకుడికి ముగ్గురు చాలా ఇంపార్టెంట్ అని. డైరక్టర్ కన్నా ఎక్కువగా కథని నమ్మే వాడు. డైరక్టర్ కన్నా ముందే కథ చూసేవాడు. డైరక్టర్ కి తెలియని యాంగిల్‌లో కథను వినేవాడు… ఈ ముగ్గురూ చాలా కీలకం. దిల్‌రాజుగారు నాకన్నా ముందే కథ విన్నారు. పీసీగారు నా కన్నా ముందే కథను చూశారు. కీరవాణిగారు నన్ను ఆశ్చర్యపరిచేలా కథను వినిపించారు. నాగ, నేనూ ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లాం. 2020లో మేమిద్దరం జర్నీ స్టార్ట్ చేశాం. మేం ఏం చేసినా, దిల్‌రాజుగారు, కీరవాణిగారు, పీసీగారితో మంచి అనుబంధం ఉండాలని కోరుకున్నాం. ఇవాళే నాకు సక్సెస్ మీట్‌లాగా అనిపిస్తోంది. టెక్నీషియన్స్ బెస్ట్ వర్క్ ఇచ్చారు. దిల్‌రాజుగారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని అనిపిస్తోంది` అని అన్నారు.ఆర్టిస్ట్ రవి మాట్లాడుతూ `ఆర్టిస్ట్ అయిన ప్రతి ఒక్కరికీ విష్ లిస్ట్ ఉంటుంది. అందులో పీసీ సర్, కీరవాణిసర్, దిల్‌రాజుగారితో పనిచేయాలనే కోరిక నాకు ఈ సినిమాతో తీరింది` అని అన్నారు.
హీరో ఆశిష్ మాట్లాడుతూ `హీరో ఆఫ్ ది డే కీరవాణిగారు. మా సినిమాను ఆయన ఒప్పుకున్నందుకు చాలా హ్యాపీ. కీరవాణిగారు సినిమా ఒప్పుకున్నప్పుడే డైరక్టర్ 70 శాతం సక్సెస్ అయినట్టు. పీసీగారు, కీరవాణిగారిలాంటి లెజెండ్స్ తో పనిచేయడం నా కెరీర్‌కి గుడ్ స్టార్ట్. లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ సాంగ్ చాలా బావుంది. నా కజిన్ కి ఏ సినిమా అంత త్వరగా నచ్చదు. అలాంటిది ఈ పాట చాలా బాగా నచ్చిందని అన్నాడు. ఏప్రిల్ 25న ఈ సినిమా మెలోడీగా, లవ్ స్టోరీగా, సస్పెన్స్ గా, హారర్ గా, థ్రిల్లర్‌గా రీచ్ అవుతుందని నమ్ముతున్నా` అని చెప్పారు.
నాయిక వైష్ణవి చైతన్య మాట్లాడుతూ `లవ్ మీ ఎప్పుడు స్టార్ట్ అయింది.. ఎప్పుడు షూట్ అయింది.. ఎప్పుడు ఆడియో లాంచ్ వరకు వచ్చిందన్నది అర్థం కాలేదు. చాలా ఫాస్ట్ గా జరిగింది మొత్తం. ఈ టీమ్ అంతా చాలా ఎనర్జిటిక్‌గా, ఫోకస్‌తో పనిచేశారు. వాళ్లందరినీ చూసి మోటివేట్ అయ్యేదాన్ని. నేనెంత అలిసిపోయినప్పటికీ, అందరి ఎనర్జీ చూసి హుషారు వచ్చేది. చాలా నేర్చుకున్నాను నేను ఈ సినిమాతో. గతంలో ఆడియో లాంచ్ అంటే చాలా ఎనర్జీతో వెయిట్ చేసేవాళ్లం. నేనూ, మా అమ్మ ఓ ఆడియో లాంచ్‌కి వెళ్లి సినిమా వాళ్లని చూడ్డానికి దూరంగా నిలుచుని వెయిట్ చేశాం. ఇప్పుడు నా సెకండ్ సినిమా ఆడియో వేడుకకు ఇలాంటి గొప్ప వేదిక మీద ఉన్నాను. లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో తలచుకుంటుంటే అసలు నాకేం అర్థం కాలేదు. చాలా ఆనందంగా ఉన్నాను. సెకండ్ సినిమాకి ఇంత మంది పెద్ద వారితో పనిచేయడం మర్చిపోలేని అనుభూతినిస్తోంది. అసలు ఈ లెజెండ్స్ అందరిదీ వేరే లోకం. వాళ్ల స్థాయికి అసలు రీచ్ కాలేమేమో అని అనుకునేదాన్ని. కానీ ఇవాళ వాళ్లందరి పక్కనా నేనున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కీరవాణిగారిని ఫస్ట్ కలిసినప్పుడు చాలా భయమేసింది. ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరక్టర్ ముందు కూర్చుని ఓ అన్ ప్రొఫెషనల్ అమ్మాయిగా ఓ పాట పాడాను. `నీ వాయిస్ బావుంది పిల్లా.. బాగా పాడుతున్నావు అని ఆయన అన్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. నన్ను పుష్ చేసి నాతో పాట పాడించారు కీరవాణిగారు. నా చిన్నప్పుడు అయ్యప్ప పూజల్లో భక్తి పాటలు పాడేదాన్ని. పీసీ సార్ ఎవరికైనా ఫ్రేమ్ పెడితే వాళ్లు అదృష్టం చేసుకున్నారని అంటారు. ఇప్పుడు మా టీమ్ మొత్తం చాలా అదృష్టం చేసుకున్నది కాబట్టే, ఆయన ఈ సినిమాకు పనిచేశారు. డిఫరెంట్ లవ్ స్టోరీ ఇది. ఏప్రిల్ 25న మా సినిమా థియేటర్లలోకి వస్తోంది. యూనిక్ లవ్ స్టోరీ అని అందరూ మెచ్చుకుంటారు. ఆశిష్ చాలా స్వీట్ పర్సన్“ అని తెలిపారు.ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మాట్లాడుతూ “ ఆటగదరా శివ అని ఓ టైటిల్ పాటని రాశారు చంద్రబోస్‌గారు. ఆటగదరా శివ అనే పదాలు తనికెళ్ల భరణిగారి జీవితంలో ఎంత ప్రధానమైనవో అందరికీ తెలుసు. అందుకే ఆయనకి విషయం చెప్పి అనుమతి తీసుకుని ఈ పాట చేశాం. ఈ సినిమాకు పనిచేయడానికి మేం స్టూడియోలో డ్యాన్స్ చేశాం. చంద్రబోస్‌గారితో ఓ ఫైట్ కూడా చేశాం(నవ్వుతూ).. సినిమా పెద్ద విజయం సాధించాలని ఆశిస్తున్నా. అందరికీ ఉగాది శుభాకాంక్షలు “ అని చెప్పారు.
Also Read:పొట్ట ఉబ్బిందా.. ప్రమాదమే!