హీరో అల్లు అర్జున్‌ కార్‌వాన్‌కు ప్రమాదం..!

435
Allu Arjun
- Advertisement -

టాలీవుడ్‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కార్‌వాన్‌కు స్వల్ప ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో నవంబర్‌ 2020 నుంచి జనవరి 2021 రెండు భారీ షెడ్యూల్స్‌ను చిత్ర యూనిట్‌ పూర్తి చేసింది.

ఈ క్రమంలో సినిమా షూటింగ్ ముగించుకొని హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఖమ్మం రూరల్ ప్రాంతంలోని సత్యనారాయణపురం వద్ద బన్నీ కారవాన్ ను ఓ లారీ వెనుకనుంచి ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారవాన్‌లో మేకప్ మన్ మాత్రమే ఉన్నాడు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

- Advertisement -