TTD:స్వర్ణరథంపై కల్యాణ వేంకటేశ్వరుడు

6
- Advertisement -

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా మంగ‌ళ‌వారం సాయంత్రం స్వామివారి స్వర్ణరథోత్సవం కన్నుల పండుగగా జరిగింది.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొని ర‌థాన్ని లాగారు.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఉత్సవర్లను వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం చేప‌ట్టారు.

మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, ప‌సుపు, చందనం‌తో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.

Also Read:ధనుష్ రాయన్ వాయిదేనా?

- Advertisement -