హన్మంతుని జన్మస్థలంపై క్లారిటీ ఇచ్చిన టీటీడీ…

173
ttd
- Advertisement -

రామభక్త హన్మంతుని జన్మస్థలంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధారాలతో సహా క్లారిటీ ఇచ్చింది. తిరుమలలోని అంజనాద్రే హన్మంతుని జన్మస్థలం అని స్పష్టం చేశారు జాతీయ సంస్కృత వర్సిటీ వైఎస్‌ చాన్స్‌లర్‌ ఆచార్య మురళీధరశర్మ.

ఆంజనేయుని జన్మస్థానంపై నిరూపించేందుకు సంకల్పం తీసుకున్నామని, దానికై తమ అన్వేషణ కొనసాగిందని పేర్కొన్నారు. నాలుగు నెలలుగా పండితులంతా కలిసి ఆధారాలు సేకరించామని …వేంకటాచల మహాత్యాన్ని పౌరాణిక ఆధారంగా తీసుకున్నామని ఆయన తెలిపారు. పౌరాణిక, చారిత్రక, శాసన, భౌగోళిక ఆధారాలు సేకరించామని …వేంకటాచలానికి అంజనాద్రితోపాటు 20 పేర్లు ఉన్నాయని తెలిపారు.

అంజనాద్రికి హనుమ జన్మించాడని పురాణాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. అంజనాదేవికి తపోఫలంగా హనుమంతుడు జన్మించాడని…హన్మంతుడు ఇక్కడ పుట్టడం వల్లే అంజనాద్రి అని పేరు వచ్చిందని తెలిపారు. కర్ణాటకలోని హంపి హన్మంతుడి జన్మస్థలం కాదని స్పష్టం చేశారు. అన్నమయ్య కీర్తనల్లో వేంకటాచలాన్ని అంజనాద్రిగా వర్ణించారని ఆచార్య మురళీధరశర్మ వివరించారు.

- Advertisement -