హనుమంతుడు యువతకు ఆదర్శప్రాయుడు

11
- Advertisement -

జననీ అంజనా సమేత బాలాంజనేయస్వామి వారి జయంతి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం జరిగిన మహాత్ముల సందేశం కార్యక్రమంలో కడపకు చెందిన రామకృష్ణ మఠం ప్రధాన కార్యదర్శి   అనుపమానంద మహారాజ్ తిరుమలలోని నాద నీరాజన మండపంలో అనుగ్రహ భాషణం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హనుమంతుడు శక్తి, సంకల్ప శక్తి, విధేయత, నిజాయతీకి చిహ్నం అని యువతకు ఆదర్శనీయుడని ఉద్ఘాటించారు .

రాముడు ఎక్కడ ఉంటే హనుమంతుడు అక్కడ కొలువై ఉంటాడని, పవిత్రమైన స్వామి భక్తికి నిదర్శనమని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అనుసరించాల్సిన పవిత్రమైన బంధం అలాంటిదేనని ఆయన అన్నారు.

Also Read:టీడీపీ విజయం..టీఎఫ్‌సీసీ హర్షం

- Advertisement -