2024 సంవత్సరం దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారాన్ని దక్కించుకున్నాయి. మొత్తం ఈ ఏడాది 8 రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జమ్మూకశ్మీర్, హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్రలో ఎన్నికలు జరగగా.. ఐదు రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించింది.
ఏప్రిల్ 19న అరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు జరుగగా బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. సిక్కింలో ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగగా సిక్కిం క్రాంతికారీ మోర్చా మరోసారి ఎన్నికల్లో గెలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో మే 13న ఎన్నికలు జరుగగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయాన్ని సాధించింది. సీఎంగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు.
ఒడిశాలో బీజూ జనతాదళ్‌ను ఓడించి బీజేపీ తొలిసారి అధికారాన్ని దక్కించుకుంది. పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరుగగా నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచి ఒమర్ అబ్దుల్లా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. హర్యానాలో బీజేపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోగా నయాబ్ సింగ్ సైనీ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
జార్ఖండ్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరుగగా జార్ఖండ్ ముక్తి మోర్చా అధికారాన్ని నిలబెట్టుకోగా హేమంత్ సోరేనె సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్రలో నవంబరు 20న ఎన్నికలు జరుగగా బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
Also Read:ఈ ఏడాది నెటిజన్లు వెతికిన టాప్ 10 వంటకాలివే!