వైసీపీ ఎంపీపై లుక్ అవుట్‌ నోటిసులు

8
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి షాక్ తగిలింది. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించగా మిథున్ రెడ్డి పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది.

దీంతో సిట్‌ అప్రమత్తమై మిథున్‌రెడ్డి దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకుంది. ఆయనపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. లిక్కర్‌ స్కామ్‌లో మిథున్‌ రెడ్డి పాత్రపై సిట్‌ ఆధారాలు సేకరించింది.

కేసు విచారణ కీలక దశలో ఉందని, ఈ సమయంలో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. లిక్కర్‌ స్కామ్‌లో రాజ్‌ కసిరెడ్డి ఏ1గా, మిథున్‌రెడ్డి ఏ4గా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే రాజ్‌ కసిరెడ్డితో పాటు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, వెంకటేశ్‌ నాయుడు, సజ్జల శ్రీధర్‌రెడ్డి సహా 11 మందిని సిట్‌ అరెస్టు చేసింది.

Also Read:కొత్తపల్లిలో ఒకప్పుడు..పక్కా హిట్!

- Advertisement -