Look Back 2024 : తెలుగు రాష్ట్రాలు.. టర్నింగ్ పాయింట్‌

3
- Advertisement -

ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలు నమోదయ్యాయి. ఏపీలో వైసీపీఓటమి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, డిప్యూటీ సీఎంగా పవన్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల, కేంద్రమంత్రిగా బండి సంజయ్‌ ఇలా ఎన్నో సంచలనాలు నమోదయ్యాయి. ఈ ఏడాదికే హైలెట్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన వైసీపీ ఈసారి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 సీట్లు కైవసం చేసుకుంది. ఏపీ చరిత్రలోనే ఇది రికార్డు విజయం.

తెలంగాణలోని మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ 8, బీజేపీ 8, ఎంఐఎం 1 ఎంపీ సీటు కైవసం చేసుకున్నాయి. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా తెరవలేదు. పొలిటికల్ పవర్ స్టార్ పవన్‌కు ఈ ఏడాది ఖచ్చితంగా కలిసివచ్చిందనే చెప్పాలి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైన పవన్…డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అలాగే మెగాబ్రదర్ నాగబాబు త్వరలో మంత్రి పదవి చేపట్టనున్నారు.

అలాఏగు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్ట్ దేశ రాజకీయాల్లో పెనుసంచలనం అయ్యింది. మద్యం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేయగా 165 రోజుల అనంతరం బెయిల్ లభించింది. వైఎస్ షర్మిల తెలంగాణ నుంచి ఏపీకి షిఫ్ట్ అయి తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే ఎంపీగా పోటీ చేసిన షర్మిలకు భంగపాటు తప్పలేదు.

Also Read:Year Ender 2024: ఎన్నికల్లో గెలిచిన..ఓడిన నేతలు వీరే! 

- Advertisement -