Look Back 2024: స్టార్టప్‌లకు కలిసొచ్చిన ఏడాది!

3
- Advertisement -

2024 ముగింపు దశకు వచ్చేసింది. ఇక ఈ ఏడాది ఎన్నో స్టార్టప్‌లు విజయవంతంగా ప్రారంభమయ్యాయి. స్టార్టప్ కంపెనీ ప్రారంభించి సక్సెస్ అయిన వాటిలో జెప్టో అగ్రస్థానంలో ఉంది. జెప్టో అనేది హైపర్ లోకల్ డెలివరీ ప్లాట్‌ఫారమ్. ఇది కేవలం 10 నిమిషాల్లోనే కస్టమర్‌లకు మంచి ఆర్డర్‌లను అందజేస్తామని హామీ ఇచ్చింది. Zepto ద్వారా పండ్లు, కూరగాయలు, మందులు సహా ఇతర కిరాణా వస్తువులను కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. దేశంలోని దాదాపు అన్ని పెద్ద నగరాలకు సేవలను అందిస్తోంది.

2018లో ప్రారంభమైన స్టార్టప్‌లలో ఒకటి క్రిడ్. 2024లో దాదాపు 6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. క్రెడిట్ కార్డ్ వినియోగదారులు తమ క్రెడిట్ బిల్లు చెల్లింపులను CRED ద్వారా సులభంగా చెల్లింపు చేసుకోవచ్చు. ప్రస్తుతం 25 మిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులను కలిగి ఉంది. ఓలా తక్కువ సమయంలోనే మంచి కస్టమర్ బేస్‌ను సంపాదించుకుంది.

భారత్ పే చిన్న వ్యాపారులు, కిరాణా దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులను సులభతరం చేసుకునేందుకు వచ్చిన స్టార్టప్. BharatPe ద్వారా రుణ సౌకర్యం కూడా పొందవచ్చు. దేశం అంతటా 63 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది.

Also Read:తెలుగు నేటివిటి కథ.. ‘విడుదల-2’

- Advertisement -