Look Back 2024: ఈ హీరోల సినిమాలే లేవు!

1
- Advertisement -

2024 మరో పది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది టాలీవుడ్‌లో కొన్ని పెద్ద, చిన్న సినిమాలు సత్తాచాటాయి. ఇందులో కొంతమంది హీరోలు చాలా కాలం తర్వాత హిట్‌లు కొట్టగా కొంతమంది హీరోలు సినిమాలు ఒక్కటి కూడా రాలేదు. ఇందులో అగ్ర హీరోలతో పాటు చిన్న హీరోలు సైతం ఉన్నారు.

ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి, మాస్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి వంటి హీరోలు ఉన్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నుండి ఒక్క సినిమా కూడా రాలేదు. దీంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.

వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ సినిమా డిసెంబర్‌లో రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ ఏడాది తన అభిమానుల ముందుకు రాలేకపోయాడు. అలాగే మరికొంతమంది హీరోల సినిమాలు కూడా ఈ ఏడాది రాలేదు. కానీ వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ఈ హీరోలు అలరించేందుకు రెడీగా ఉన్నారు.

Also Read:ఇదేనా రేవంత్ తీసుకొచ్చిన మార్పు: కేటీఆర్

- Advertisement -