2024 సంవత్సరం మరో పది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జరిగిన ముఖ్యమైన మరియు వివాదాస్పద అలాగే కుంభకోణాల విషయాలను ఓ సారి పరిశీలిద్దాం. దక్షిణ కొరియా యుద్ధ చట్టం నుండి కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై దారుణమైన అత్యాచారం-హత్య వరకు ఎన్నో సంచలనాలు నమోదయ్యాయి.
డిసెంబర్ 3 న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ … ఉత్తర కొరియా నుండి వచ్చే ముప్పును ఉటంకిస్తూ “అత్యవసర యుద్ధ చట్టం” ప్రకటించారు . దీనిపై ఎద్ద ఎత్తున నిరసన వ్యక్తం కాగా ఆ దేశ పార్లమెంట్‌లో ఓటింగ్ నిర్వహించగా ఆ చట్టం వీగిపోయింది.
పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాలనే వినేష్ ఫోగట్ కల కలగానే మిగిలిపోయింది. 2024 ఒలింపిక్స్‌లో మహిళల 50 కిలోల రెజ్లింగ్ నుండి ఆమె అనర్హురాలుగా ప్రకటించబడింది. కేవలం 100 గ్రాముల బరువు మాత్రమే ఉండటంతో ఆమెను తప్పించగా ఇది భారతదేశంలో సంచలనంగా మారింది. ఆ తర్వాత ఆమె రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అనంతరం జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు.
గత సంవత్సరం భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ శరణ్ పై లైంగిక దోపిడీ ఆరోపణలు చేస్తూ జరిగిన రెజ్లర్ల నిరసనలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఫోగట్.
అలాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల నుండి తప్పుకున్నారు జో బైడెన్. తొలుత పోటీ చేస్తానని చెప్పినా ఆ తర్వాత తన ప్రసంగాల్లో నోరు జారడం, ట్రంప్‌తో చర్చ సందర్భంగా బైడెన్ గ్రాఫ్ పడిపోవడంతో ఆయన అధ్యక్ష ఎన్నిక నుండి తప్పుకోవాల్సి వచ్చింది. బైడెన్ స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పోటీ చేయగా ఆమె ఓడిపోయారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ట్రంప్. జనవరిలో వైట్‌హౌస్‌లో అడుగుపెట్టబోతున్నారు ట్రంప్.
Also Read:Look Back 2024: స్టార్టప్‌లకు కలిసొచ్చిన ఏడాది!