Look Back 2024: డిజాస్టర్ సినిమాలివే!

1
- Advertisement -

2024 టాలీవుడ్‌కు మిశ్రమ ఫలితాన్నే మిగిల్చింది. కొన్ని సినిమాలు రికార్డులను బ్రేక్ చేయగా మరికొన్ని సినిమాలు డిజాస్టర్‌లుగా మిగిలాయి. ఇందులో అగ్రహీరోల సినిమాలు ఉండటం విశేషం. తమిళ సూపర్ స్టార్ సూర్య నటించిన భారీ బడ్జెట్ సినిమా కంగువ. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈచిత్రం ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాగా నిలిచింది.

దర్శకుడు శంకర్.. భారతీయుడు 2 సినిమాతో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. కమలాసన్ ప్రధానపాత్రలో భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా రాగా దారుణ పరాభవాన్ని చవిచూసింది. 250 కోట్ల ఖర్చుతో నిర్మిస్తే కేవలం 150 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన భారీ బడ్జెట్ మూవీ మైదాన్. ఈ సినిమాకు అమిత్ రవీందర్ నాథ్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రూ. 250 కోట్లతో తెరకెక్కించగా కేవలం 70 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. మరో సినిమాబడే మియాన్ చోటే మియన్. అక్షయ్ కుమార్ ,టైగర్ ష్రాఫ్ నటించిన సినిమా కూడా భారీ డిజాస్టర్ గా నిలిచింది. 350 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా కేవలం రూ . 60 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అలాగే ఆలియాభట్ జిగ్రా సైతం తీవ్ర నిరాశ పర్చింది.

Also Read:ఎన్టీఆర్ ఘాట్ జోలికి వస్తే ఊరుకోం: గోపినాథ్

- Advertisement -