Look Back 2024: బోర్డర్-గవాస్కర్‌ ట్రోఫీనే వీరికి చివరిది!

0
- Advertisement -

భారత క్రికెట్ జట్టులో ఎంతోమంది ఆటగాళ్లు సత్తాచాటిన వారున్నారు. అయితే ఎంతో మంది భారత లెజెండ్ క్రికెటర్లకు బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీనే చివరి మ్యాచ్‌గా మిగిలింది. దిగ్గజ స్టార్ ప్లేయర్ అనిల్ కుంబ్లే.. 2008లో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీతో రిటైర్ అయ్యాడు. ఎంఎస్‌ ధోని ఆఖరి టెస్ట్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.

భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరైన సౌరవ్ గంగూలీ కూడా 2008 బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలోనే రిటైర్‌ అయ్యాడు. 2011-12 సిరీస్‌లో ఆస్ట్రేలియాతో భారత్ 4-0తో ఘోరంగా ఓడిపోవడం వల్ల రాహుల్ ద్రవిడ్ రిటైర్ అయ్యాడు. ద్రవిడ్ చివరి టెస్ట్ అడిలైడ్‌లో జరిగింది.

2012 బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలోనే రిటైర్‌ అయ్యాడు వీవీఎస్ లక్ష్మణ్‌. వీరేంద్ర సెహ్వాగ్ …2013 సిరీస్ సమయంలో హైదరాబాద్‌లో తన చివరి టెస్టు ఆడాడు. చివరి ఇన్నింగ్స్‌లో కేవలం ఆరు పరుగులే చేశాడు. సెహ్వాగ్ మొత్తం 104 టెస్టుల్లో 8,586 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు ఉన్నాయి. ధోని సైతం 2014 బోర్డర్- గావస్కర్‌ ట్రోఫీలో మెల్‌బోర్న్ టెస్టు తర్వాత ధోని టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ధోని మొత్తం 90 టెస్టులు ఆడి, 4,876 పరుగులు చేశాడు.

Also Read:TTD: శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

- Advertisement -