తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతికి ఆనవాలు బతుకమ్మ. అంతేకాదు తెలంగాణ సాంస్కృతిక సంపద బతుకమ్మ. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుందీ మన బతుకమ్మ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా బతుకమ్మ సందడే కనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటి పండుగ సప్తసముద్రాలు దాటితే ఎలా ఉంటుంది. ఇదే ఆలోచన లండన్లో సెటిల్ అయినా మన తెలంగాణ అమ్మాయికి వచ్చింది. మన బతుకమ్మ పండగని లండన్ దేశస్థులకి పరిచయం చేసింది.
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్లో చేనేత బతుకమ్మ – దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకే నలుమూలల నుంచి ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, అదే స్పూర్తితో రాష్ట్ర మంత్రి కేటీఆర్ కృషికి మా వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ఈ సంవత్సరం కూడా వేడుకలను “చేనేత బతుకమ్మ, దసరా ” గా జరుపుకున్నామని సంస్థ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం తెలిపారు. దసరా పండుగ సందర్బంగా స్వదేశం నుంచి తెచ్చిన శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన దసరా ” అలాయ్ – బలాయ్ ” కార్యక్రమంలో, చేనేత శాలువాలను ఒకరికొరకు పరస్పరం వేసుకొని, జమ్మి ( బంగారం) ని ఇచ్చి పుచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకొని, చేనేతకు చేయూతగా వీలైనన్ని సందర్భాల్లో చేనేత బట్టలు దరిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ వేడుకలకు హాజరైన ప్రవాస సంఘాల ప్రతినిదులు ఐక్యతను చాటుతూ మనమంతా ఒకటే అంటూ చేయి చేయి కలిపి అభివాదం చేశారు. జమ్మి ఆకులు పంచుకుంటూ లండన్ పట్టణానికి ‘అలాయ్ బలాయ్’ ల తెలంగాణ స్నేహమాధుర్యాన్ని ప్రత్యక్షంగా రుచి చూపించారని పలువురు ప్రశంసించారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ మరియు దసరాపండగ సందర్బంగా మహిళలందరు భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ బద్దంగా గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆట పాటలతో, కోలాటాల నృత్యాలతో, చప్పట్లు కలుపుతూ, రంగు రంగుల బతుకమ్మలతో సందడి చేసారు. బతుకమ్మల మద్య చార్మినార్ ఆకృతితో పూలతో అలంకరించిన ప్రతిమ వేడుకలకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆతుథులందరి ప్రశంసలందుకోవడం జరిగింది. విదేశాల్లో స్థిరపడ్డా కానీ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరిని ఆకట్టుకుంది. చిన్నారులు సైతం ఆటల్లో పాల్గొనడం కాకుండా, చిన్న చిన్న బతుకమ్మలతో సంబరాలకు కొత్త అందాన్ని తెచ్చారు.
ఈ కార్యక్రమంలో టాక్ వ్యవస్థాపకుడు మరియు ఎన్నారై టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, టాక్ అద్యక్షులు పవిత్ర రెడ్డి కంది, ఉపాధ్యక్షులు సేరు సంజయ్ ,స్వాతి బుడగం, మరియు ముఖ్య సభ్యులు గోపాల్ మేకల ,మట్టా రెడ్డి,వెంకట్ రెడ్డి దొంతుల,నవీన్ రెడ్డి ,శ్రీకాంత్ జెల్ల,అశోక్ గౌడ్ దూసరి, రత్నాకర్ కడుదుల,మల్లా రెడ్డి, రంజిత్ చాతరాజు ,సాయి బూరుగుపల్లి ,సత్యం కంది ,వంశీ వందనపు ,వేణు గోపాల్ రెడ్డి,గణేష్ పాస్తం ,రాకేష్ పటేల్ ,నవీన్ భువనగిరి ,రవి రత్తినేని ,రవి ప్రదీప్ పులుసు,,సత్య చిలుముల,శ్రీధర్ రెడ్డి, రాజేష్ వర్మ ,రవి కిరణ్,వెంకీ సుదిరెడ్డి, సతీష్ రెడ్డి గొట్టిముక్కుల , జస్వంత్ , భరత్ బాశెట్టి , వేణు నక్కిరెడ్డి వంశీ పొన్నం మహిళా విభాగం సభ్యులు,సుప్రజ పులుసు,ప్రవల్లిక భువనగిరి,క్రాంతి రత్తినేని,శ్రావ్య వందనపు, మమత జక్కీ ,శ్వేతా మహేందర్, ప్రియాంక, తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.