పార్లమెంట్ కమిటీలలో టీఆర్ఎస్ ఎంపీలు

383
Telangana-MPs
- Advertisement -

లోక్ సభ సెక్రటేరియట్ లో వివిధ పార్లమెంట్ కమిటీలను ప్రకటించారు స్పీకర్ ఓం బిర్లా. వివిధ శాఖలకు ఛైర్మన్లు, సభ్యులను నియమించినట్లు లోక్‌సభ సచివాలయం వెల్లడించింది. పరిశ్రమలపై టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కె కేశవరావు అధ్యక్షుడుగా 21 మంది లోక్‌సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులుమొత్తం 31 మంది ఎంపీలతో పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుచేశారు. రైల్వేపై రాధామోహన్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో సభ్యుడిగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు.

వాణిజ్యంపై వైయస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీనేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో సభ్యుడిగా టిఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావును నియమించారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై ప్రో. రాంగోపాల్ యాదవ్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో సభ్యురాలిగా మాలోత్ కవిత.

వ్యక్తిగత, పౌర ఫిర్యాదులు, చట్టం-న్యాయం పై భుపేందర్ యాదవ్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో సభ్యుడిగా రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ను ఎంపీక చేశారు. వ్యవసాయంపై పి.సి. గడ్డిగౌడర్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో సభ్యుడిగా ఎంపీ బీబీ పాటిల్. ఇన్ఫర్మేషన్, టెక్నాలజీపై శశిథరూర్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో సభ్యుడిగా ఎంపీ రంజిత్ రెడ్డి.

డిఫెన్స్ పై జూవల్ ఓరం నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో సభ్యుడిగా కెప్టెన్ లక్ష్మీకాంతరావు. ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ పై సుదీప్ బందోపాధ్యాయా నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో సభ్యుడిగా ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి. కార్మిక అంశంపై బర్తృహరి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో సభ్యుడిగా ఎంపీ బండ ప్రకాష్ లను ఎంపిక చేశారు.

- Advertisement -