- Advertisement -
కిసాన్ సర్కార్ లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే గతంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా బీఆర్ఎస్‌గా గుర్తించింది. తాజాగా లోక్‌సభలో కూడా ఇక నుంచి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మార్పు చేస్తూ లోక్‌సభ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసిందని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ మేరకు లోక్‌సభ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఇక నుంచి లోక్‌సభలో ఫ్లోర్‌లీడర్‌గా కొనసాగనున్నట్టు నామా నాగేశ్వరరావు తెలిపారు. ఇందుకు సంబంధంచిన ఉత్తర్వులు అందిందని అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి క్రీయాశీలకంగా వ్యవహరిస్తామని…అలాగే తెలంగాణ ప్రజల గొంతుకను పార్లమెంట్‌లో వినిపిస్తున్నామని స్పష్టం చేశారు.
Also Read: బీజేపీ ” సినీ గాలం “.. వర్కౌట్ అవుతుందా ?
- Advertisement -