లోకేశ్ మళ్లీ ఏసేశారు.. !

240
lokesh
- Advertisement -

ఏపీ మంత్రి,చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ మళ్లీ తడబడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను టార్గెట్ చేయబోయి.. సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తీసుకెళ్లడానికి కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారంటూ వ్యాఖ్యానించి నాలుక కరుచుకున్నారు. ఆయన వ్యాఖ్యానించారు.

ఆదివారం మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారంలో కేసీఆర్‌ను విమర్శించే క్రమంలో పప్పులో కాలేశారు లోకేష్. పోలవరం ప్రాజెక్టును కేసీఆర్ ఆపాలని చూస్తున్నారని భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా ఇక్కడున్న మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తీసుకెళ్లడానికి కేసీఆర్ అహర్నిశలు కష్టపడుతున్నారని లోకేశ్ వ్యాఖ్యానించారు.

లోకేశ్ వ్యాఖ్యలు కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లోకేష్ వ్యాఖ్యల పట్ల నెటిజన్లు పంచ్‌లు వేస్తున్నారు. మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తీసుకెళ్లడం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నిస్తున్నారు.

నారా లోకేశ్ ఇలా తడబాటుకు గురవడం ఇదే తొలిసారి కాదు. రాజకీయ ఆరంగేట్రం దగ్గరి నుండి మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం వరకు పప్పులో కాలేస్తూనే ఉన్నారు.జయంతి వేడుకలను వర్దంతి అనడం,ప్రతీ గ్రామంలో తాగునీటి సమస్య సృష్టించడమే లక్ష్యం అనడం లోకేష్‌కే చెల్లింది. ఇక ఇటీవల తాజాగా వివేకానంద హత్య విషయమై మాట్లాడుతూ.. పరశించాం అని చెప్పడం, అంతేగాదు ఏప్రిల్‌ 11న ఎన్నికైలేతే ఏప్రిల్ 9న టీడీపీకి ఓటేయ్యండంటూ వ్యాఖ్యానించడాన్ని ప్రచారంలో అస్త్రంగా వాడుకుంటోంది వైసీపీ.

- Advertisement -