- Advertisement -
తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ దాన కిషోర్‌ని బదిలీ చేశారు. ఆయన స్ధానంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా రంగారెడ్డి కలెక్టర్ లోకేష్ కుమార్‌కి బాధ్యతలు అప్పజెప్పారు.
ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న దాన కిషోర్‌ని జలమండలి కమిషనర్‌గా నియమించింది ప్రభుత్వం. ఇక రంగారెడ్డి జాయింట్ కలెక్టర్‌గా ఉన్న హరీష్ ఇకపై రంగారెడ్డి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
- Advertisement -