అమరావతిలో బాబు..అనంతపురంలో లోకేష్

8
- Advertisement -

ఏపీలోని అమరావతిలో చంద్రబాబు… అనంతపురంలో లోకేష్ పర్యటించారు. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఎస్ఐపీబీ సమావేశం ముందుకు 19 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు వచ్చాయి.

19 ప్రాజెక్టులకు సంబంధించిన రూ.33 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు రాగా 35 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది ఎస్ఐపీబీ. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలకు సంబంధించి పెట్టుబడులకు ముందుకొచ్చాయి వివిధ సంస్థలు.

ఇక అనంతపురంలో మంత్రి లోకేష్‌కు ఘనస్వాగతం లభించింది. లోకేష్‌కు టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఇవాళ రామరాజుపల్లెలో టీడీపీ ఉత్తమ కార్యకర్తలతో లోకేష్ భేటీ కానున్నారు. అనంతరం గుంతకల్లు టీడీపీ నేతల భేటీలో పాల్గొని కీలక సూచనలు చేయనున్నారు. రేపు బేతపల్లిలో రెన్యు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు లోకేష్. అలాగే ఎమ్మెల్యే సురేంద్ర కూతురు పెళ్లికి , 17న అనంతపురం JNTU స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు లోకేష్.

Also Read:నైరుతి రుతుపవనాల..అప్‌డేట్

- Advertisement -