సోషల్ మీడియా పేరు చెబితే టీడీపీ పార్టీ బయపడిపోతుంది. ఎందుకంటే టెక్నాలజీ టెక్నాలజీ అని చెప్పుకునే టీడీపీకి,సోషల్ మీడియాలో అంతగా క్రేజ్ లేదు. అంతగా పాపులారిటీ లేదు…చంద్రబాబు ఫాలోవర్స్ అంతకన్నా లేదన్నది వాస్తవం. ఇందుకు టీడీపీ నేతలు కూడా లోలోపల అంతర్మదనం పడుతుంటారు. దీంతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌ను పెంచేందుకు బాబు చేసిన కసరత్తులు ఏవి ఫలించలేదు.
కానీ చంద్రబాబు తనయుడు లోకేష్ పుణ్యమాని ఆకోరిక తీరిపోయింది. నిన్న కాకమొన్న మంత్రి అయ్యాడో లేదో సోషల్ మీడియాలో ఇప్పుడు లోకేష్‌కి సంబంధించిన వార్తలే వైలర్ అవుతున్నాయి. మంత్రిగా ప్రమాణం చేసిన సమయంలో సార్వ భౌ అంటూ పదాలను పలకడంలో ఇబ్బంది పడ్డ లోకేష్ అంబేద్కర్ జయంతిని వర్దంతిగా మార్చేసి నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారాడు.
ఇప్పుడు తాజాగా మరోసారి లోకేష్ నోరుజారారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కరపలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ లోకేష్ అన్న మాటలు విని సామాన్య జనం అవాక్కయ్యారు. తాగునీటి సమస్య సృష్టించడమే తన లక్ష్యమంటూ పేర్కొనడం ఆసక్తిగా మారింది. తాగునీటి సమస్య పరిష్కరిస్తానని చెప్పడానికి బదులు స్వయంగా మంత్రిగారు ఇలా చెప్పడంతో కరప వాసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. దీంతో నెటిజన్లు లోకేష్ వీడియో రిలీజ్ అయితే చాలు ఎగబడి చూస్తున్నారు. కామెంట్లు,షేరింగ్‌లతో హోరతిస్తున్నారు.
గతంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం తన అర్దం కానీ మాటలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారగా ఇప్పుడు లోకేష్ ఆయన్ని మించిపోయారు.