- Advertisement -
ఏపీ మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దు అయింది. నేపాల్ లో నెలకొన్నపరిస్థితుల నేపథ్యంలో ఏపీకి చెందిన వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపై మంత్రి లోకేష్ దృష్టి సారించారు.
ఉదయం 10 గంటలకు సచివాలయం లోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ కు లోకేష్ రానున్నారు. రియల్ టైమ్ గవర్నెన్స్ వేదికగా ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే ఆర్టీజీఎస్ సెంటర్ కి రావాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సప్ నంబర్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించనున్నారు లోకేష్. నేపాల్ లో చిక్కుకున్న వారి వివరాలు సేకరించి కేంద్ర ప్రభుత్వం సహకారంతో తక్షణమే వారిని రాష్ట్రానికి తీసురావడానికి రంగంలోకి దిగారు లోకేష్.
Also Read:ఆర్‌ఎస్‌ఎస్ నుండి ఉపరాష్ట్రపతిగా!
- Advertisement -

