దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్‌ను మరో 2 వారాల పాటు పొడిగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో, లాక్ డౌన్ మే 17 వరకు కొనసాగనుంది. లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో రెడ్ జోన్ లో కట్టుదిట్టమైన చర్యలు, ఆంక్షలు అలాగే కొనసాగనున్నాయి. ఆరంజ్ జోన్లలో కొన్ని మినహాయింపులనిచ్చింది. కంటైన్మెంట్ జోన్లలో పూర్తి ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. జోన్ల పరిస్థితిపై ప్రతివారం అంచనా వేసి, మదింపు ఉంటుందని కేంద్ర స్పష్టం చేసింది.
కాగా గ్రీన్ జోన్లలో అన్ని కార్యకలాపాలకు కేంద్ర అనుమతి ఇచ్చింది. గ్రీన్ జోన్లో బస్సులు నడిపేందుకు కేంద్రం అనుమతించింది. 33 శాతం సిబ్బందితో గ్రీన్ జోన్లలో ప్రైవేట్ కార్యాలయాలు పని చేయవచ్చని తెలిపింది. వలస కూలీలను తరలించేందుకు రైళ్లకు అనుమతి ఇచ్చింది. విమాన ప్రయాణాలపై నిషేధం కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ పేర్కొంది.