మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల కోడ్ ఈ క్షణం నుంచే అమలులోకి వచ్చింది అని… అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపాం అన్నారు.
565 మండలాల్లో ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తాం అని… 15 రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తాం అని వెల్లడించారు. అక్టోబర్ 9 నుంచి నామినేషన్ల స్వీకరణ…అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత పోలింగ్ జరగనుంది.
అక్టోబర్ 27న రెండో విడత పోలింగ్ జరగనుండగా అక్టోబర్ 17న సర్పంచ్ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ జారీ కానుంది. 31న తొలి విడత పోలింగ్, అక్టోబర్ 21 నుంచి రెండో విడత నామినేషన్లు..నవంబర్ 4న రెండో విడత సర్పంచ్ ఎన్నికలకు పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు రాణి కుముదిని.
Also Read:స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
మొదటి దశ (ఎంపీటీసీ, జెడ్పీటీసీలు)
నోటిఫికేషన్ తేదీ – అక్టోబర్ 9
పోలింగ్ తేదీ – అక్టోబర్ 23
కౌంటింగ్ తేదీ – నవంబర్ 11
రెండో దశ (ఎంపీటీసీ, జెడ్పీటీసీలు)
నోటిఫికేషన్ తేదీ – అక్టోబర్ 13
పోలింగ్ తేదీ – అక్టోబర్ 27
కౌంటింగ్ తేదీ – నవంబర్ 11
మూడో దశ (గ్రామపంచాయతీలు, వార్డులు)
నోటిఫికేషన్ తేదీ – అక్టోబర్ 17
పోలింగ్ తేదీ – అక్టోబర్ 31
కౌంటింగ్ తేదీ – అక్టోబర్ 31
నాలుగో దశ (గ్రామపంచాయతీలు, వార్డులు)
నోటిఫికేషన్ తేదీ – అక్టోబర్ 21
పోలింగ్ తేదీ – నవంబర్ 4
కౌంటింగ్ తేదీ – నవంబర్ 4
ఐదో దశ (గ్రామపంచాయతీలు, వార్డులు)
నోటిఫికేషన్ తేదీ – అక్టోబర్ 25
పోలింగ్ తేదీ – నవంబర్ 8
కౌంటింగ్ తేదీ – నవంబర్ 8

