బిగ్ బాస్ 5…లోబో ఎలిమినేట్

127
lobo
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 8 వారాలు పూర్తి చేసుకుంది. ఇక 8వ వారంలో భాగంగా ఇంటి నుండి లోబో ఎలిమినేట్ అయ్యారు. లోబో ఎలిమినేషన్‌తో అంతా షాక్ తిన్నారు.

ఇక హౌస్‌ నుండి ఎలిమినేట్ అయిన లోబో షాకింగ్ విషయాలు వెల్లడించారు. తనేదైనా తప్పుగా మాట్లాడితే క్షమించమని కాజల్‌ను వేడుకున్నాడు. తర్వాత లోబోతో ఐదుగురు మిత్రువులు- ఆరుగురు శత్రువులు గేమ్‌ ఆడించాడు నాగార్జున.

తనకు ఎల్లప్పుడూ బూస్ట్‌ ఇచ్చే విశ్వ తన ఫ్రెండ్‌ అని తెలిపాడు. అలాగే కాజల్‌, సన్నీ, రవి కూడా తన మిత్రువులేనని పేర్కొన్నాడు. ఇక ఐదో ఫ్రెండ్‌ యానీ గురించి చెప్తూ ఆమె కెప్టెన్‌ అయితే మా గల్లీలో పటాకులు కాలుస్తానన్నాడు. మిగిలిన షణ్ముఖ్‌, జెస్సీ, సిరి, మానస్‌, పింకీ, శ్రీరామ్‌ శత్రువులని వెల్లడించారు లోబో.

- Advertisement -