విండీస్ 181 ఆలౌట్..

204
ashwin
- Advertisement -

రాజ్‌కోట్‌లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది కోహ్లీ సేన. వెస్టిండీస్‌పై తీరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ విజయాతీరాలకు కొద్దిదూరంలో నిలిచింది. తొలి రోజు బ్యాట్‌తో పరుగుల వరద పారించిన టీమిండియా రెండోరోజు బంతితోనూ సమాధానం చెప్పింది. భారత బౌలర్ల ధాటికి విండీస్ బౌలర్లు చేతులేత్తేశారు.

మూడో రోజు ఓవర్‌ నైట్ స్కోరు 94 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించిన విండీస్ 181 పరుగులకు చాప చుట్టేసింది. దీంతో భారత్ కంటే 469 పరుగులు వెనుకబడి ఉంది. ఫాలో అన్‌లో బ్యాటింగ్ ఆరంభించిన విండీస్‌..ఓటమి దాదాపు ఖరారైనట్లే.

విండీస్ బ్యాట్స్‌ మెన్‌లలో రోస్టన్ చేస్ 53,పౌల్ 47 పరుగలు చేయగా మిగితా బ్యాట్స్ మెన్ అంతా చేతులెత్తేశారు.. భారత బౌలర్లు విజృంభించడంతో ఆ జట్టు బ్యాటింగ్‌ పేకమేడను తలపించింది. ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 29 ఓవర్లలో 94 పరుగులకే ఆరు వికెట్లు చేజార్చుకుంది. భారత బౌలర్లో అశ్విన్ 4,షమీ 2 వికెట్లు తీయగా ఉమేష్ యాదవ్,కుల్దీప్,జడేజా తలో వికెట్ తీశారు.

- Advertisement -