వినాయకుడి సేవలో బంగ్లాదేశ్‌ క్రికెటర్..

24
- Advertisement -

వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు బంగ్లాదేశ్ క్రికెటర్ లిట్ట‌న్ దాస్ . హిందువు అయిన లిట్ట‌న్ దాస్…కుటుంబంతో క‌లిసి ఇంట్లో గ‌ణ‌ప‌య్య‌ను పూజించాడు. ఆ ఫొటోల‌ను అతడు ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నాడు.

గ‌ణేశుడి ఆశీర్వాదం మీకు ఉంటుంది అనే అర్థం వ‌చ్చేలా లిట్ట‌న్ దాస్ ఆదివారం ఓ పోస్ట్ పెట్టాడు. వినాయ‌కుడు మీకు శ‌క్తిని ఇచ్చుగాక‌. మీ బాధ‌ల‌న్నీ తొల‌గించుగాక‌. మీ జీవితంలో సంతోషాన్ని నింపుగాక అంటూ లిట్ట‌న్ త‌న పోస్ట్‌లో రాసుకొచ్చాడు.

పాకిస్థాన్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో శ‌త‌కంతో చెల‌రేగిన లిట్ట‌న్ త్వ‌ర‌లోనే భార‌త ప‌ర్య‌ట‌న కోసం జ‌ట్టుతో క‌లువ‌నున్నాడు. సెప్టెంబ‌ర్ 19న భార‌త్, బంగ్లాదేశ్‌ల మ‌ధ్య తొలి టెస్టు జ‌రుగ‌నుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Litton Das (@litton_kumer_das)


Also Read:ఏపీలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

- Advertisement -