లిక్కర్ స్కాం…ఈడీ దాడులు

205
manish
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ సోదాలను ముమ్మరం చేసింది. ఇవాళ ఢిల్లీ సహా గురుగ్రామ్, లక్నో, హైదరాబాద్, ముంబై, బెంగళూరుల్లో 35 చోట్ల సోదాలు జరుపుతోంది. ఈ కేసులో నిందితుడు సమీర్ మహేంద్రుకు చెందిన ఢిల్లీ నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి.

ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ 2021-22 రూపకల్పన, అమలులో అక్రమాలు జరిగినట్లు సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ గత నెలలో మనీశ్ సిసోడియా నివాసంలో తనిఖీలు చేసింది.

ఈ నేపథ్యంలో మనీశ్ సిసోడియా మాట్లాడుతూ, ఈ కేసులో మొదట సీబీఐ సోదాలు చేసిందని, ఏమీ దొరకలేదని, ఇప్పుడు ఈడీ సోదాలు చేస్తోందని, వారికి కూడా ఏమీ దొరకబోవని చెప్పారు. తనకు ఎటువంటి సమాచారం లేదని, వాళ్ళు వచ్చినా పాఠశాలల బ్లూప్రింట్లు మాత్రమే వారికి దొరుకుతాయని చెప్పారు.

- Advertisement -