డిల్లీ లిక్కర్ స్కామ్ గత కొన్నాళ్లుగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆం ఆద్మీ పార్టీ నేతలే టార్గెట్ గా ఈ స్కామ్ లో దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటికే డిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనిష్ సిసోడియా తో పాటు పలువురు ఆప్ నేతలను అరెస్ట్ చేసిన సంగతి విధితమే. ఇక తరువాత సీబీఐ ఎవరిని టార్గెట్ చేయబోతుంది అనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. అయితే ఈ లిక్కర్ స్కామ్ లో డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉందని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అందరూ ఊహించినట్లుగానే కేజ్రీవాల్ నిన్న సీబీఐ నోటీసులు అందుకున్నారు.
ఆ విషయాన్ని స్వయంగా కేజ్రీవాల్ మీడియా సమావేశం ద్వారా వెల్లడించారు. అయితే ఇలా నోటీసులు ఇవ్వడంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పై తీవ్ర స్థాయిలో మండి పడుతున్న కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. కేవలం ఆరోపణలే ఆధారంగా ఇలా నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. “మోడీకి వెయ్యి కోట్లు ఇచ్చానని చెబుతా.. మోడీని కూడా అరెస్ట్ చేస్తారా ? ” అంటూ మండిపడ్డారు. కాగా తాను దర్యాప్తు సంస్థలను గౌరవిస్తానని, విచారణకు హాజరవుతానని అన్నారు కేజ్రీవాల్.
కాగా బిజెపి యేతర పార్టీల నేతలపై కేంద్రం ఈడీ, సీబీఐ దాడులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కామ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ను కూడా ఇరికెంచే ప్రయత్నం చేస్తోంది మోడీ సర్కార్. అయితే నిరాధార ఆరోపణల ద్వారా కేంద్రం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మోడీ సర్కార్ ను ప్రశ్నించిన వారిపైనే ఇలా ఈడీ, సీబీఐ దాడులు నిర్వహించడం చూస్తున్నాం. మరి స్కామ్ లు చేసే వారు కేవలం విపక్ష పార్టీల్లోనే ఉన్నారా అధికార బిజెపిలో లేరా అనే ప్రశ్నకి మాత్రం మోడీ సర్కార్ వద్ద ఎలాంటి సమాధానం ఉండదు. ఏది ఏమైనప్పటికి డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు అందడం.. దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
I have received summons from CBI. I will certainly honour it. My press conference on the same. https://t.co/JwFtwb5Kfq
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 15, 2023
ఇవి కూడా చదవండి…