రాష్ట్రంలో మద్యం దుకాణాల పెంపు

366
Wines Shops
- Advertisement -

రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 2017లో రూపొందించిన అబ్కారీ విధానం గడువు సెప్టెంబరుతో ముగిసిపోనుంది. దీంతో అక్టోబర్ 1 నుంచి కొత్త టెండర్లు వేయనున్నారు. కొత్త టెండర్లలో మరిన్ని దుకాణాలు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది ఆబ్కారీ శాఖ.

రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటైన నేపథ్యంలో వాటికి తగ్గట్టుగా దుకాణాల సంఖ్య పెంచాలని భావిస్తున్నారు. ప్రతి మండల కేంద్రంలోనూ కనీసం ఒక మద్యం దుకాణం ఉండేలా చూడాలనే విధానాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్ధికరణలో భాగంగా కొత్తగా 125మండలాలు ఏర్పాడ్డాయి.

వీటిలో దాదాపు సగం వరకూ మండల కేంద్రాల్లో దుకాణాలు లేవు. ఇప్పుడు ఆయాచోట్ల ఏర్పాటుకు అవకాశం ఇవ్వడంతోపాటు డిమాండును బట్టి మిగతా మండల కేంద్రాలకూ మరికొన్ని ఇవ్వాలని భావిస్తున్నారు. అక్టోబరు 1వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి రాబోతోంది. ఇది కూడా రెండేళ్లపాటు అమల్లో ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2216 వైన్‌ దుకాణాలు, 670 బార్లు ఉన్నాయి.

- Advertisement -