ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం నిర్ణయం తీసుకుంది. మద్యపాన నిషేధం దిశగా ఒక్కో అడుగు ముందుకేస్తూ జగన్ సర్కార్ పలు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించేసిన సర్కార్.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి రాష్ట్రంలో వ్యక్తిగత మద్యం నిల్వలపై ఆంక్షలు విధించనుంది. ఈ నేపథ్యంలో ఒక్కో వ్యక్తి వద్ద మూడు కంటే ఎక్కువ మద్యం బాటిల్స్ ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది.
నూతన ఎక్సైజ్ చట్టం ప్రకారం నేటి నుంచి నుంచి ఈ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుంది. దీనిప్రకారం.. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ 3 సీసాలు, ఫారిన్ లిక్కర్ 3 సీసాలు, మిథైలేట్ స్పిరిట్ 3 బల్క్‌లీటర్లు, బీర్ 6 సీసాలు (650 మి.లీ.), కల్లు 2 బల్క్‌లీటర్లను ఒక వ్యక్తి ఎలాంటి అనుమతి అవసరం లేకుండా కలిగి ఉండవచ్చని ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.