‘లైగర్’ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌..

129
Liger
- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సాలా క్రాస్ బ్రీడ్‌ అనేది ఈ సినిమా క్యాప్ష‌న్. కరోనా మూలంగా నిలిచిపోయిన ఈ చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగు నేటి నుంచి ముంబైలో జరుగుతుంది. విజయ్‌ సరసన అన‌న్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఛార్మి, క‌ర‌ణ్ జోహార్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల కాగా, ఇది చూసిన ఫ్యాన్స్‌కు పూన‌కాలు వ‌చ్చేశాయి. ఆనందంతో పోస్ట‌ర్‌కు బీరాబిషేకాలు చేశారు. కేక్ క‌టింగ్ లు చేసి సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకున్నారు. తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ పోస్ట‌ర్ రిలీజ్ చేస్తూ అఫీషియ‌ల్ విడుదల తేదీని ప్ర‌క‌టించారు. సెప్టెంబ‌ర్ 9న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ స‌హా మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల్లోను రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

- Advertisement -