‘లై’ లో అర్జున్‌ లుక్‌ అదిరింది..

262
- Advertisement -

నితిన్‌ కథానాయకుడిగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘లై’ (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి). విభిన్నమైన కథా కథనాలతో నితిన్ హీరోగా ఈ సినిమా రూపొందుతుంది. ఆగస్టు 11న ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. దాదాపు విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాలో, యాక్షన్ కింగ్ అర్జున్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు.

LIE Telugu Movie Arjun Pre Look

అయితే ఈ సినిమాలో అర్జున్‌ పాత్రకి సంబంధించిన ప్రీ లుక్ ను ఈరోజు రిలీజ్ చేశారు. బాత్ టబ్ లో అర్జున్ సేదదీరుతుండగా వెనుక నుంచి తీసిన స్టిల్ ను ప్రీ లుక్ గా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో అర్జున్ మెడ భాగంలో వున్న టాటూ ఆయన పాత్ర స్వభావాన్ని తెలియజేస్తోంది. రేపు అర్జున్ ఫస్టులుక్ ను రిలీజ్ చేస్తారట. ‘లై’ (lie) అనే మాటకు లవ్ .. ఇంటలిజెన్స్ .. ఎనిమీ అనే అర్థం చెప్పారు. ఆసక్తికరమైన కథా కథలతో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా, కథానాయికగా మేఘా ఆకాశ్ పరిచయమవుతుంది.

LIE Telugu Movie Arjun Pre Look

యూత్‌స్టార్‌ నితిన్‌, మేఘా ఆకాష్‌, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, శ్రీరామ్‌, రవికిషన్‌, పృథ్వీ, బ్రహ్మాజీ, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్‌, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, డాన్స్‌: రాజు సుందరం, ఫైట్స్‌: కిచ్చా, పాటలు: కృష్ణకాంత్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.

- Advertisement -