రివ్యూ : లై

437
Lie movie Review
- Advertisement -

యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మించిన భారీ చిత్రం ‘లై’ .అ… ఆ ఘన విజయం తర్వాత నితిన్ నటించిన చిత్రం కావడం..కృష్ణ గాడి వీర ప్రేమ కథ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వం లో తెరకెక్కడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఇంతటి భారీ అంచనాల మధ్య విడుదలైన లైతో నితిన్ ఆకట్టుకున్నాడా..? హను రాఘవపూడికి మరో బ్రేక్ ఇచ్చిందా లేదా చూద్దాం…

కథ:

అర్జున్ ఒక సీక్రెట్ మాఫియా డాన్. రవి కిషన్  లోకల్ డాన్ గా అర్జున్ కింద పని చేస్తూ ఉంటాడు. జైలు నుంచి విడుదలైన నితిన్ కి మేఘ ఆకాష్ తో ఓ అబద్ధం తో పరిచయం ఏర్పడుతుంది. ఆ అబద్దాలతోనే ఆమె ని ప్రేమలో పడేస్తాడు నితిన్. అలా నడుస్తున్న వారి ప్రేమ కథ ఇంట్రవెల్ టైం లో కొత్త మలుపు తీసుకుంటుంది. నితిన్ కి ఒక బ్యాగ్ దొరుకుతుంది. ఆ బాగ్ తనకి తెచ్చి ఇవ్వాలని అర్జున్ నితిన్ ని కోరుతాడు. అసలు ఆ బ్యాగ్ లో ఏముంది, నితిన్ కి, అర్జున్ కు  మధ్య వైరం ఎందుకొచ్చింది, చివరికి నితిన్, మేఘ ఆకాష్ ల ప్రేమ ఏమైంది అనేదే ‘లై’ కథాంశం.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్   హను రాఘవపూడి టేకింగ్‌,సూపర్బ్ లొకేషన్స్,మణిశర్మ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్  మ్యూజిక్‌. సూపర్బ్‌ లొకేషన్స్‌    నితిన్ డిఫరెంట్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. తన క్యారెక్టర్‌లో ఒదిగిపోయిన సరికొత్త నితిన్‌ని ఈ సినిమా ద్వారా చూస్తాం. మేఘా ఆకాష్‌ ఫ్రెష్ లుక్‌తో యువతను ఆకట్టుకుంది.తన నటనతో మెప్పించే ప్రయత్నం చేసింది. మొదటి సారి విలన్‌గా నటించిన అర్జున్‌…పర్వాలేదనిపించాడు. మిగితా నటీనటులు తమ పరిధి మేరకు బాగా నటించారు.

Lie movie Review

మైనస్ పాయింట్స్ :

ఫస్టాఫ్‌తో పోల్చుకుంటే సెకండాఫ్ కాస్త నెమ్మదించడంతో సాధారణ ప్రేక్షకుడు కథలో ఇన్వాల్వ్ కావడానికి సమయం పడుతుంది. సో..కాల్డ్‌ కమర్షియల్ హంగులు ఈ సినిమాలో లేకపోవడం మైనస్. కామెడీ లేకపోవడం,స్లో నేరేషన్‌ ప్రేక్షకులను ఇబ్బందిపెడుతుంది. స్టోరీలో కన్ఫ్యూజన్‌తో ప్రేక్షకులు తికమకపడతారు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడతాయి. మంచి కథను ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాడు దర్శకుడు హను రాఘవపూడి.  మణిశర్మ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలెట్. యువరాజ్ సినిమాటోగ్రఫీ , ఎస్‌ ఆర్ శేఖర్ ఎడిటింగ్ బాగుంది. 14 రీల్స్ నిర్మాణ విలువలకు వంక పెట్టలేం.

తీర్పు:

‘లై’ కథ గురించి సింపుల్‌గా చెప్పాలంటే.. హీరో నితిన్‌.. విలన్ అర్జున్‌ల మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్‌ స్టోరీ.  ఒక అందమైన అబద్ధంలాంటి ప్రేమ కథ తో ప్రేక్షకులని బాగానే ఆకట్టుకున్నాడు నితిన్‌. డిఫెరెంట్‌ మూవీని చూడాలనుకునేవారు.. తెలుగులో విభిన్నమైన కథాంశాలతో సినిమాలు రావట్లేదని బాధపడేవారు  ‘లై’ ను హాయిగా చూడవచ్చు.

విడుదల తేదీ: 11/08/2017
రేటింగ్ :2.75/5
నటీనటులు:నితిన్, మేఘా ఆకాశ్
సంగీతం:మణిశర్మ
నిర్మాత: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర
దర్శకత్వం: హను రాఘవపూడి

- Advertisement -