కేటీఆర్‌ను కలిసిన లైసెన్సుడ్ సర్వేయర్లు

3
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్సుడ్ సర్వేయర్లుగా దాదాపు 5 వేలకు పైగా నియమించినా నెలల తరబడిగా అటు పని, ఇటు జీతభత్యాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఇవాళ వారంతా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు.

ధరణి స్థానంలో పేరుకు భూభారతిని తీసుకొచ్చినప్పటికి అందులో భాగంగా ఎంపిక చేసిన లైసెన్సుడు సర్వేయర్లకు మాత్రం అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రంలో లైసెన్స్ సర్వేయర్లకు ప్రతినెల గౌరవప్రదమైన ఆదాయం వచ్చేలా ఏర్పాట్లు చేశారని, కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ సర్కారు అన్యాయం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ మేరకు తమకు ఎదురవుతున్న రెండు ప్రధాన సమస్యలతో పాటు ఇతర అంశాలపై కేటీఆర్ కి వినతి పత్రం సమర్పించారు. తమకు లైసెన్సు పత్రాలు ఇచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు జీతభత్యాల గురించి పట్టించుకోకుండా తమ కుటుంబాలను రోడ్డున పడేసారని దుయ్యబడ్డారు. ప్రభుత్వానికి అత్యంత కీలకమైన భూ సర్వే పనులు నిర్వహించే తమకు స్థిరమైన వేతనం లేకపోవడం వల్ల ఆర్థికంగా చితికి పోతున్నామని తమ కష్టాలను చెప్పుకున్నారు.

Also Read:ప్రజల కోరిక మేరకే ‘కేరళం’గా మార్పు!

ప్రతినిత్యం తమను ఎమ్మార్వో కార్యాలయాలకు పిలిపించి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోపెడుతున్నారు తప్ప ఒక్క పని కూడా అప్పగించలేదని కేటీఆర్ గారి దృష్టికి తీసుకొచ్చారు.తమకు వర్క్ అలాట్మెంట్ విషయంలో స్పష్టమైన విధానం లేకపోవడం వల్లే ప్రధానంగా సమస్య ఉత్పన్నమైందని వెల్లడించారు. ప్రతి లైసెన్సుడు సర్వేయర్ కు సమానంగా , పారదర్శకంగా పనులను కేటాయించే విధంగా ఒక సమగ్రమైన విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. లైసెన్స్ సర్వేయర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు.

- Advertisement -