అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం..

185
Let us not curse our state said KCR
- Advertisement -

అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శమని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఏ రైతుకు అన్యాయం జరగొద్దనేదే తమ ఉద్దేశమన్నారు . అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం పరిమితికి లోబడే రాష్ట్రం అప్పులు చేస్తుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అప్పులు చేయకుండా ఉన్నాయా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్ని సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అన్నారు.

రూ.17 వేల కోట్ల రుణమాఫీ కనిపించడం లేదా అని ప్రశ్నించారు సీఎం. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సలహాలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధమని తెలిపారు. విపక్షాలకు ఏం జరిగినా వంకరగానే కనిపిస్తుందన్నారు. 22 శాతం వృద్ధిరేటుతో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా ఉందన్నారు. మన విమర్శ మన రాష్ట్రానికి శాపం కాకూడదని సీఎం తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్రహ్మాండంగా జీతాలు ఇస్తున్నామని చెప్పారు. ఏ రైతుకైనా రుణమాఫీ జరగకుండా తన దృష్టికి తీసుకురావాలన్న సీఎం…రుణమాఫీ ఇచ్చేవిధంగా కృషి చేస్తామన్నారు.ఇసుక మీద మేం తీసుకొచ్చిన ఆదాయంలో 10 శాతం కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణలో ఉన్న రెసిడెన్షియల్ హాస్టల్స్ దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు సీఎం.

- Advertisement -