దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు సీఎం కేసీఆర్. మెదక్ జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని మంత్రులు హరీశ్, ప్రశాంత్త దితరులతో కలిసి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సీఎం… తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగం, ఆదాయంలో కూడా మనమే అగ్రస్థానంలో ఉన్నామని వివరించారు. సంక్షేమం విషయంలో తెలంగాణకు దరిదాపులో ఏ రాష్ట్రం లేదన్నారు.
ఆర్ధికంగా తెలంగాణ ప్రజలు అభివృద్ధి సాధించారని…మనం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.నీటిపారుదల శాఖ చాలా బాగా పని చేసిందని ….విశ్రాంతి తీసుకోకండి, ముందుకు సాగండి అని సూచించారు.
అన్ని జిల్లాల్లో నిర్మించుకున్న ఈ పరిపాలనా భవనాలు చూస్తేనే మన రాష్ట్ర అభివృద్ధి గురించి తెలిసిపోతుందన్నారు. గతంలో చేతగాని పాలకుల వల్ల రాష్ట్రం వెనుకబడి పోయిందన్నారు. ఇప్పుడు ఇంత అభివృద్ధి జరుగుతున్నా నాటి చేతగాని పాలకులు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
సీఎం వెంట ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఉన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఇద్దరు శారీరక వికలాంగులకు సీఎం ఆర్థిక సహాయం అందజేశారు. మెదక్‌లో కార్యాలయాల నిర్మాణానికి సహకరించిన అధికారులతో పాటు కార్మికులందరినీ సీఎం అభినందించారు.
Also Read:Chandrayaan 3:సేఫ్ ల్యాండింగ్‌కు అనుకూల వాతావరణం